covid positive mla modi meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరైన ఓ ఎమ్మెల్యేకు అంతకుముందే కొవిడ్ పాజిటివ్‌గా తేలడం చర్చనీయాంశంగా మారింది. ఆ శాసనసభ్యుడికి రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఫలితాలు వచ్చినా.. మోదీ సభకు హాజరయ్యారు.
MLA kailash rajput modi meet
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే, తిర్వా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కైలాశ్ రాజ్‌పుత్‌కు గురువారం(ఫిబ్రవరి 10న) కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఫిబ్రవరి 10న రాష్ట్ర వైద్య శాఖ విడుదల చేసిన ప్రకటనలోనూ ఆయన పేరు ఉంది. కాగా, మరుసటి రోజు విడుదల చేసిన జాబితాలో మాత్రం ఆయనకు కొవిడ్ నెగెటివ్‌గా వచ్చినట్లు ఉంది. ఆ తర్వాత రోజే మోదీ సభ జరిగింది. ఈ సందర్భంగా మోదీతో స్టేజీపై కనిపించారు ఎమ్మెల్యే. ప్రధానితో చేతులు కలిసి అభివాదం కూడా చేశారు.
![covid positive mla modi meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14455863_modi-meet.jpg)
ఈ విషయంపై ముఖ్య వైద్యాధికారి వినోద్ కుమార్‌ను సంప్రదించగా.. ఎమ్మెల్యేకు తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, ఆ తర్వాత నెగెటివ్‌గా ధ్రువీకరణ అయిందని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని చెప్పారు. మోదీ కార్యక్రమానికి ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దేవభూమిలో ఎన్నికలకు సర్వం సిద్ధం