కర్ణాటకలోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండ్య జిల్లా.. మాలవళ్లి తాలూకా ఆసుపత్రిలో కరోనా వార్డులోనే.. మహమ్మారితో మరణించిన వారి మృతదేహాలను ఉంచి చికిత్స అందిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పడకల కొరతతో పాటు.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు వాపోతున్నారు.


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగుపరచాలని రోగుల బంధువులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: కరోనా రోగుల్లో 9లక్షల మందికి ఆక్సిజన్‌తో చికిత్స