ETV Bharat / bharat

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం లేఖ

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ నిబంధనలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది కేంద్రం. రానున్న పండుగల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనకుండా స్థానికంగా ఆంక్షలు విధించాలని సూచించింది.

COVID: Centre asks states to restrict public observance of festivals, limit or stop gatherings
'కేసులు పెరుగుతున్నాయ్​..నిబంధనలు విధించండి'
author img

By

Published : Mar 24, 2021, 6:00 PM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కొవిడ్​-19 నిబంధనలపై దృష్టి సారించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా తెలిపారు.

'రానున్న హోలీ, షాబ్​-ఈ-బరత్​, బిహూ, ఈస్టర్​, ఈద్-ఉల్-ఫితర్​.. పండుగల దృష్ట్యా జాతీయ విపత్తు నిర్వాహణ చట్టం-2005 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్థానికంగా కఠిన నిబంధనలు విధించుకోవచ్చు' అని రాష్ట్రాలకు పంపిన లేఖలో కేంద్రం పేర్కొంది.

రద్దీ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తేనే కొవిడ్​ వ్యాప్తిని అరికట్టవచ్చని లేఖలో పేర్కొంది కేంద్రం.

ఇదీ చదవండి : కరోనా పంజా: భారత్​లో మరో కొత్త వేరియంట్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.