ETV Bharat / bharat

తమిళనాడులో 31వేల కేసులు, 486 మరణాలు - మహారాష్ట్రలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి తమిళనాడును బెంబేలెత్తిస్తోంది. కొత్తగా 31 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు మరణాల్లో అత్యధికంగా 486 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య శుక్రవారం కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది.

covid cases in tamilandu
తమిళనాడులో కరోనా కేసులు
author img

By

Published : May 28, 2021, 11:02 PM IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యలు ఫలిస్తోన్న వేళ తమిళనాడులో మాత్రం వైరస్​​ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 31,079 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు మరణాల్లో అత్యధికంగా 486 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తొలిసారి కేసుల సంఖ్య కన్నా కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. 31, 255 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశ రాజధానిలో వైరస్​ కట్టడి చర్యలు సఫలీకృతమవుతున్నాయి. కొత్తగా 1,141 కేసులు వెలుగులోకి వచ్చాయి. 139 మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

మహారాష్ట్రలో 20,740 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 424 మంది చనిపోయారు.

కేరళలో 22,318 కేసులు నమోదయ్యాయి. 194 మంది మృతి చెందారు.

కర్ణాటకలో 22, 823 కేసులు బయటపడ్డాయి. 401 మంది మరణించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 20,000 కేసులు వెలుగుచూశాయి. 159 మంది ప్రాణాలు కోల్పోయారు.

వ్యాక్సినేషన్..

ఇప్పటివరకు దేశంలో 20.86 కోట్ల వాక్సిన్​ డోసుల పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 18-44 మధ్య వయసు వారిలో శుక్రవారం 13 లక్షల మందికి పైగా తొలి డోసు వేసుకున్నారని వెల్లడించింది.

ఇదీ చూడండి: రాష్ట్రాలకు మరో 3 లక్షల కరోనా టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.