ETV Bharat / bharat

Covid Cases in India: దేశంలో భారీగా తగ్గిన కొవిడ్​ కేసులు

Covid Cases in India: భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,07,474 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 865 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

COVID CASES IN INDIA
కొవిడ్​ కేసుల అప్డేట్​
author img

By

Published : Feb 6, 2022, 9:52 AM IST

Covid Cases in India: భారత్​లో కొవిడ్​ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జరిపిన 14,48,513 పరీక్షల్లో 1,07,474 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 865 మంది మరణించారు. 2,13,246 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 2.90 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.91 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం మరణాలు: 5,01,979
  • యాక్టివ్ కేసులు: 12,25,011
  • మొత్తం కోలుకున్నవారు: 4,04,61,148

దేశంలో కొత్తగా 45,10,770 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,46,26,697 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22 లక్షల మందికి కరోనా సోకింది. 8 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.39 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,751,840 కు పెరిగింది.

  • US Corona Cases: అమెరికాలో కొత్తగా 2.05 లక్షల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 1,051 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2.14 లక్షలకు పైగా కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. మరో 170 మంది చనిపోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1.54 లక్షల మందికి వైరస్​ సోకగా.. 800 మంది చనిపోయారు.
  • రష్యాలో తాజాగా 1.77 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 714 మంది బలయ్యారు.
  • జర్మనీలో ఒక్కరోజే దాదాపు 1.66 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 98 మంది మృతి చెందారు.

ఇవీ చూడండి:5 కోట్ల కార్బివాక్స్‌ డోసులకు కేంద్రం ఆర్డర్‌.. అందుకోసమేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.