Covid cases in India today: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా మరో 9,216 మందికి వైరస్ సోకినట్లు తేలింది. 24 గంటల వ్యవధిలో 391 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8,612 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 34,61,5,757,
- మొత్తం మరణాలు: 4,70,115
- యాక్టివ్ కేసులు: 99,976
- మొత్తం కోలుకున్నవారు: 3,40,45,666
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. గురువారం 73,67,230 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,25,75,05,514కు చేరిందని స్పష్టం చేసింది.
World Covid cases
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 685,799 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్కరోజే 7,095 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 26,44,25,257కు చేరింది. మరణాల సంఖ్య 52,49,129కు పెరిగింది.
- US covid cases: అమెరికాలో ఒక్కరోజులో 132,822 కరోనా కేసులు బయటపడ్డాయి. 1,264 మంది ప్రాణాలు కోల్పోయారు.
- Germany covid cases: జర్మనీలో 73,486 కేసులు వెలుగులోకి వచ్చాయి. 357 మంది మహమ్మారితో మృతిచెందారు.
- France covid cases: ఫ్రాన్స్‌లో 48,416 కరోనా కేసులు బయటపడ్డాయి. 103 మంది మరణించారు. 3,764 మంది కోలుకున్నారు.
- UK covid cases: బ్రిటన్‌లో 53,945కొవిడ్ కేసులు నమోదుకాగా.. 141 మంది చనిపోయారు.
- Russia covid cases: రష్యాలో కొత్తగా 33,389 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి మరో 1,221 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి: 'బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు.. మరో ఐదుగురికి..'