ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగి​న కొవిడ్​ కేసులు.. ముప్పు తప్పదా? - కొవిడ్ యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం 8 గంటల వరకు కొత్తగా 5,335 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

covid cases in india
covid cases in india
author img

By

Published : Apr 6, 2023, 10:32 AM IST

Updated : Apr 6, 2023, 11:46 AM IST

దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5,335 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహమ్మారి వల్ల 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

  • దేశంలో కొత్తగా 5,335 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • 194 రోజుల తర్వాత దేశంలో ఒక రోజులో ఇవే అత్యధిక కేసులు
  • కొవిడ్ వైరస్ వల్ల మరో 13 మరణించారు.
  • కొవిడ్​ సోకడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇద్దరు మరణించగా.. కేరళ, పంజాబ్​లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
  • ఇప్పటి వరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 5,30,929కు చేరింది.
  • దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కు చేరింది.
  • కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,39,054 మందికి కొవిడ్​ సోకింది.
  • కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,82,538 కాగా.. రికవరి రేట్​ 98.75గా ఉంది.
  • ఇప్పటివరకు 220.66 కోట్ల కొవిడ్​ టీకాలు పంపిణీ చేశారు.
  • బుధవారం ఒక్కరోజే 1,60,742 మందికి కొవిడ్ నిర్థరణ పరీక్షలు చేశారు.
  • దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
  • పాజిటివిటీ రేటు 25 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో ఈ రేటు 26.54 శాతానికి చేరింది.
  • గత 15 నెలల్లో ఇదే అత్యధికం. గతేడాది జనవరిలో అత్యధికంగా 30 శాతానికి చేరింది.
  • ఇప్పటివరకు దిల్లీలో 20,12,064 మంది కరోనా బారిన పడ్డారు.
  • బుధవారం ఒక్కరోజే 1,918 కరోనా పరీక్షలు నిర్వహించారు.
  • ఝార్ఖండ్​లో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 51కు చేరింది.
  • ఇప్పటివరకు రాష్ట్రంలో 4,42,661 మంది కరోనా బారిన పడ్డారు.
  • కొవిడ్​ నుంచి ఇప్పటివరకు 4,37,278 మంది కోలుకున్నారు.
  • కరోనా వైరస్​ బారిన పడి 5,332 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రాష్ట్రంలో బుధవారం 1,177 కరోనా పరీక్షలు చేశారు.

అంతకుముందు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకు 4,435 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం లక్షా 31 వేల కొవిడ్ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.38శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

ఇవీ చదవండి : ప్రియురాలిని చంపిన ప్రియుడు.. 10 అడుగుల గోతిలో పాతిపెట్టి..

'చేతగానివారిలా ఉంటేనే ఆ పార్టీలో చోటు'.. కాంగ్రెస్​పై ఆజాద్​ ఫైర్

Last Updated : Apr 6, 2023, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.