ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. అమెరికా, జపాన్​లో ఉగ్రరూపం - ప్రపంచ కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 20,557 మంది వైరస్ బారిన పడగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. జపాన్​, అమెరికాలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. జపాన్​లో కొత్తగా 1.80 లక్షల మందికి కరోనా సోకగా.. అమెరికాలో 1.14 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.

covid cases in india
కరోనా కేసులు
author img

By

Published : Jul 28, 2022, 10:35 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 20,557 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 19,216 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,39,59,321
  • మొత్తం మరణాలు: 5,26,211
  • యాక్టివ్​ కేసులు: 1,46,323
  • కోలుకున్నవారి సంఖ్య: 4,32,86,787

Vaccination India: భారత్​లో బుధవారం 40,69,241 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 203.21 కోట్లు దాటింది. మరో 3,96,783 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 8,79,504 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,939 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,81,82,232కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,10,337 మంది మరణించారు. ఒక్కరోజే 9,82,341 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,82,79,714కు చేరింది.

  • జపాన్​లో 1,80,226 కేసులు నమోదు కాగా.. 108 మంది మరణించారు.
  • అమెరికాలో తాజాగా 1,14,116 కేసులు నమోదు కాగా.. 397 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 1,00,182 మందికి కరోనా సోకింది. 25 మంది బలయ్యారు.
  • ఇటలీలో కొత్తగా 63,837 మందికి వైరస్​ సోకగా.. 207 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో​ తాజాగా 58,638 మందికి వైరస్​ సోకగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : ఎంపీల 50 గంటల నిరాహార దీక్ష.. తిండి, నిద్రా అంతా అక్కడే..

'సారా ఇప్పించండి సారూ'... హోంమంత్రికి కల్తీ మద్యం బాధితుడి విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.