Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 19,893 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.94శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 20,419 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు : 4,40,19,811
- మొత్తం మరణాలు: 5,26,530
- యాక్టివ్ కేసులు: 1,36,478
- కోలుకున్నవారి సంఖ్య: 4,34,24,029
Vaccination India:
భారత్‌లో బుధవారం 38,20,676 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.22 కోట్లు దాటింది. మరో 4,03,006 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు అధికంగానే నమోదయ్యాయి. కొత్తగా 8,29,153 మంది వైరస్ బారినపడగా.. మరో 2,054 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,50,41,290కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,27,389 మంది మరణించారు. ఒక్కరోజే 10,11,506 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,14,32,758కు చేరింది.
- జపాన్‌లో 1,95,801 కేసులు నమోదు కాగా.. 125 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 1,19,866 కేసులు నమోదు కాగా.. 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 431 మంది మరణించారు.
- ఇటలీలో కొత్తగా 45,621 మందికి కరోనా సోకింది. 171 మంది బలయ్యారు.
- ఇదీ చూడండి :
- 11 నెలల ముందే భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చిన నేత.. 'మన అట్లీ'!
- NEXT CJI: కీలక తీర్పుల్లో భాగస్వామి... తర్వాతి సీజేఐ ఈయనే