ETV Bharat / bharat

స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 16,935 మంది వైరస్ బారిన పడగా.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid cases in india
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Jul 18, 2022, 9:21 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే 3,500 కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,935 మంది వైరస్​ బారినపడగా.. మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,069 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది.

  • మొత్తం కేసులు : 4,37,67,534
  • మొత్తం మరణాలు: 5,25,760
  • యాక్టివ్​ కేసులు: 1,44,264
  • కోలుకున్నవారి సంఖ్య: 4,30,97,510

Vaccination India: భారత్​లో ఆదివారం 4,46,671 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 200 కోట్లు దాటింది. మరో 2,61,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,30,140 మంది వైరస్​ బారినపడగా.. మరో 628 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,76,43,065కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,87,596 మంది మరణించారు. ఒక్కరోజే 4,42,843 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,86,58,217కు చేరింది.

  • జపాన్​లో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 104,832మందికి వైరస్ సోకింది. 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 73,668 మందికి కరోనా సోకింది.
  • ఇటలీలో కొత్తగా 67,817మందికి వైరస్​ సోకగా.. 79 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 40,342మందికి వైరస్​ సోకగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో 37,899 కేసులు నమోదు కాగా.. 30 మంది మరణించారు.

ఇవీ చూడండి : మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. అయితే రక్తదానం చేయాల్సిందే!

నేటి నుంచే పార్లమెంట్​ సమావేశాలు.. అగ్నిపథ్​పై చర్చకే విపక్షాలు పట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.