ETV Bharat / bharat

'భారత్​లో ఫోర్త్ వేవ్ వచ్చినా బేఫికర్.. మాస్క్ రూల్ సడలించడం బెటర్!' - భారత్​లో ఒమిక్రాన్ వ్యాప్తి

Covid-19 Wave In India: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుండటం, కొవిడ్ సాధారణ వ్యాప్తి కారణంగా ప్రజల్లో రోగనిరోధకశక్తి ఏర్పడటం కారణంగా భవిష్యత్తులో ఎన్ని వేవ్​లు వచ్చినా పెద్దగా ప్రభావం చూపవని వైద్య నిపుణలు అభిప్రాయపడ్డారు. దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను సడలించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలన్నారు.

Covid-19 Wave In India
కొవిడ్-19 వేవ్​లు
author img

By

Published : Mar 20, 2022, 4:08 PM IST

Covid-19 Wave In India: చైనా, హాంకాంగ్​లో కొవిడ్​-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్​లోని వైద్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతున్నందున భవిష్యత్తులో ఎలాంటి వేరియంట్లు పుట్టుకొచ్చినా, వేవ్​లు వచ్చినా పెద్దగా ప్రభావం చూపవని అభిప్రాయపడ్డారు. దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో మాస్కు ధరించడం తప్పనిసరి నిబంధనను తొలగించే మార్గాలపై కేంద్రం దృష్టిసారించాలని అన్నారు.

కొవిడ్​-19 అనేది ఆర్​ఎన్​ఏ వైరస్ అవ్వడం వల్ల జన్యుపరివర్తన చెందడం సాధారణమని దిల్లీ ఎయిమ్స్​లోని వైద్యులు డాక్టర్. సంజయ్ రాయ్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని వేవ్​లు​ వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.

"గతేడాది భారత్ కొవిడ్​ సెకండ్​ వేవ్​ను చూసింది. అది దురదృష్టకరం. అయితే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అందువల్ల భవిష్యత్తులో వచ్చే వేవ్​లు మనపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు." అని డాక్టర్. సంజయ్ రాయ్​ తెలిపారు.

మాస్కు ధరించడం తప్పనిసరి అనే నిబంధనను కేంద్రం పునఃపరిశీలించాలని సంజయ్ రాయ్ సూచించారు. వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో ఉన్నవాళ్లు మాత్రం ముందజాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్కు ధరించడం కొనసాగిస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు. సార్స్- సీఓవీ-2 వైరస్​పై క్షేత్రస్థాయిలో పరిశీలన, జీనోమ్ సీక్వెన్సింగ్.. తదితర విధానాలను ఎప్పటికప్పుడు కేంద్రం చేపట్టడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే వేరియంట్లను ముందుగానే గుర్తించొచ్చని వివరించారు.

కొత్త వేరియంట్ వచ్చినా వ్యాప్తి తక్కువే..

Covid New Variant In India: భవిష్యత్తులో ఒకవేళ కొత్త వేరియంట్ ప్రబలినా.. గత వేరియంట్ల మాదిరి విజృంభించడం తక్కువేనని అన్నారు మరో వైద్యుడు డాక్టర్​. చంద్రకాంత్ లహారియా.

"మూడు వేవ్​లను తట్టుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగింది. మరోవైపు వ్యాక్సినేషన్​ పూర్తికావొస్తుంది. అందువల్ల భవిష్యత్తు వేవ్​లతో ముప్పు తక్కువే. ప్రస్తుతం ఉన్న అధ్యయనాలు, ఒమిక్రాన్​ వ్యాప్తిని పరిశీలిస్తే.. దేశంలో కొవిడ్-19 వైరస్ అంతం అయినట్లుగా భావించొచ్చు." అని డాక్టర్. చంద్రకాంత్ లహారియా పేర్కొన్నారు.

శరీరంలోని యాంటీబాడీలు కొద్దికాలానికి తగ్గిపోయినా.. రోగనిరోధకశక్తి మాత్రం ఎప్పటికీ మనల్ని సంరక్షిస్తుందన్నారు. ఇతర దేశాల్లో కొవిడ్ వ్యాప్తిపై కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని సూచించారు. మాస్కు నిబంధనను గ్రేడింగ్ పద్ధతిలో ఎత్తివేయాలని అన్నారు.

కొవిడ్ వచ్చినా లక్షణాలు సున్నా..

Mask Rules In India: మాస్కు ధరించడం వల్ల కొవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని సఫ్దార్​జంగ్ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ డాక్టర్. జుగల్ కిశోర్ తెలిపారు. అంతేకాక.. ప్రజల్లో రోగనిరోధకశక్తి పెరగడం వల్ల భవిష్యత్తులో కొత్త వేవ్​లు వచ్చినా లక్షణాలు ఉండకపోవచ్చని అన్నారు.

వారికే ముప్పు ఎక్కువ

Covid-19 wave in india: వాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగడం, రోగనిరోధకశక్తి కారణంగా..గతంలో సెకండ్ వేవ్ లాంటి పరిణామాలు మళ్లీ రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు కొవిడ్​-19 ఎన్​టీఏజీఐ ఛైర్మన్ డాక్టర్. ఎన్​కే అరోరా. కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్లు, ఒక్క డోసు తీసుకున్న వారికే భవిష్యత్తులో ముప్పు అధికం అన్నారు. అందుకే వయోజనులంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

గతవారం.. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత పాంత్ర అధికారులతో సమావేశమైంది. వైరస్ శాంపిల్స్​ను ఎప్పటికప్పుడు జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియంకు(ఇన్ఫాకాగ్‌) పంపించాలని ఆదేశించింది. దీనివల్ల కొత్త వేరియంట్లను గుర్తించవచ్చని పేర్కొంది. ఈ మేరకు మార్చి 16న కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ సమావేశం అయ్యారు. జీనోమ్ సీక్వెన్సింగ్, దేశంలో కొవిడ్​-19 వ్యాప్తిపై దృష్టిసారించాలన్నారు.

ఇదీ చూడండి: తగ్గుతున్న కరోనా తీవ్రత.. రెండు వేల దిగువకు కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.