"కరోనా టీకా ఉత్పత్తిని వేగవంతం చేస్తూనే ఉన్నాం. అయితే వాక్సిన్ అనేది జీవసంబంధనమైన పదార్థం. దాన్ని ఉత్పత్తి చేసి, నాణ్యతను పరీక్షించడానికి సమయం పడుతుంది. రాత్రికి రాత్రే ఇదంతా చేయడం అంటే మామూలు విషయం కాదు" అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో టీకా ఉత్పత్తి, సరఫరాల కోసం జాతీయ, అంతర్జాతీయ టీకా తయారీ సంస్థలైన ఫైజర్, మోడెర్నాలతో భారత ప్రభుత్వం, జాతీయ టీకా నిపుణుల బృందం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. టీకా లభ్యతకు అవరోధాలు ఉన్నప్పటికీ, కేవలం 130 రోజుల్లో 20కోట్ల ప్రజలకు వాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. టీకా పంపిణీలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కోంది.
ఇదీ చదవండి: రాష్ట్రాలకు మరో 3 లక్షల కరోనా టీకాలు