దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే(రాత్రి 8 గంటల వరకు) 26.14 లక్షల మందికి పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం 11,97,87,239 మందికి టీకా అందించినట్లు పేర్కొంది.
మొత్తం 66,689 కేంద్రాల్లో టీకా అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ టీకాలు వేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది.
జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ ప్రారంభమైంది. మార్చి 1 నుంచి 60-45 ఏళ్లు పైబడిన వారితో సహా.. ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి ఏప్రిల్ 1 నుంచి టీకా పంపిణీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'మహా' విలయం: ఒక్కరోజే 63వేల కరోనా కేసులు