ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​లో ఓపీ సేవలు బంద్​! - దిల్లీ ఎయిమ్స్​లో ఇన్​పేషంట్​ సేవలు

కరోనా విజృంభణ నేపథ్యంలో ఔట్​ పేషంట్​ సేవలను నిలిపివేస్తున్నట్లు దిల్లీ ఎయిమ్స్​ ప్రకటించింది. సాధారణ ఇన్​పేషంట్​ సేవలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

delhi aiims
దిల్లీ ఎయిమ్స్​లో ఓపీ సేవలు బంద్​!
author img

By

Published : Apr 19, 2021, 7:47 PM IST

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దిల్లీ ఎయిమ్స్​ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం(ఏప్రిల్​ 22) నుంచి ఔట్​ పేషంట్​ సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సాధారణ ఇన్​పేషంట్​ సేవలనూ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

"ఔట్​ పేషంట్​ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. స్పెషాలిటీ క్లినిక్​లు, అన్ని రకాల టెలీకన్​సల్టేషన్​ సేవలను గురువారం నుంచి నిలిపివేస్తాం. కరోనా సామాజిక వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కొవిడ్​ బాధితులకు సత్వరమే చికిత్స అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దిల్లీలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించటం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం."

- దిల్లీ ఎయిమ్స్​

అత్యవసర చికిత్స కావాల్సిన రోగులకు ఇన్​పేషంట్​ సేవలను యథావిథిగా అందిస్తామని దిల్లీ ఎయిమ్స్​ స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి విలయతాండవం సాగిస్తున్న వేళ దేశ రాజధాని దిల్లీలో లాక్‌డౌన్ విధించారు. ఇవాళ రాత్రి 10గంటల నుంచి వచ్చే సోమవారం(ఏప్రిల్ 26) ఉదయం 5 గంటల వరకూ ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇదీ చూడండి: ఉత్తర్​ప్రదేశ్​లో ఐదు ప్రధాన నగరాల్లో లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.