మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసుల విపరీతంగా పెరగడం వల్ల వివిధ జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. దీంతో అమరావతి జిల్లాలో వీధులన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. అధికారులు.. కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావడం లేదు.
కర్ఫ్యూలో భాగంగా నిత్యావసర వస్తువుల దుకాణాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతిస్తున్నారు.
సోమవారం రాత్రి 8 గంటల నుంచి వివిధ జిల్లాల్లో కర్య్ఫూ విధించింది మహా ప్రభుత్వం.
ప్రస్తుతం రాష్ట్రంలో 54,306 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకు 19,99,982మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. 51,806 మంది చనిపోయారని పేర్కొంది.
ఇదీ చూడండి: కేసుల పెరుగుదలపై అప్రమత్తం..'మహా'లో ఆంక్షలు