దేశంలో మరో 46వేల 254 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 514 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా మంగళవారం 12,09,609 నమూనాలు పరీక్షించినట్టు భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 11కోట్ల 29లక్షలు దాటింది.
రికవరీ రేటు ఇలా..
దేశంలో వైరస్‌ను జయించిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 92.09 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.49 శాతంగా నమోదైంది.
ఇదీ చదవండి: 'ఆత్మహత్య' కేసులో అర్నబ్ గోస్వామి అరెస్టు