దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 32,080 కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 97లక్షల 35వేల 850కి చేరింది. మరో 402 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య లక్షా 41వేల 360కి పెరిగింది.
రికవరీ రేటు ఇలా..
తాజాగా సుమారు 36వేల మంది వైరస్‌ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 92లక్షల 15వేల 581కి పెరిగింది. 3లక్షల 78వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 94.66 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 10లక్షల 22వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 14కోట్ల 98లక్షలు దాటినట్టు తెలిపింది.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు 'కో-విన్' యాప్