ETV Bharat / bharat

కరోనా​ 2.0 ఉగ్రరూపం అప్పుడే!

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. ఏప్రిల్​ నెల మధ్యలో వైరస్​ వ్యాప్తి రికార్డు స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. పంజాబ్​, మహారాష్ట్రలో వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు.

covid-19 second wave
ఆ నెలలో కరోనా​ 'సెకండ్ వేవ్' ఉగ్రరూపం!
author img

By

Published : Apr 2, 2021, 5:42 PM IST

ఏప్రిల్​లో కొవిడ్​ 'సెకండ్ వేవ్​' తీవ్ర స్థాయిలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మే చివరి కల్లా వైరస్​ వ్యాప్తి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఓ గణితశాస్త్ర నమూనా ఉపయోగించి ఈ అంచనాకు వచ్చారు.

"గత కొన్ని రోజులుగా దేశంలో వైరస్​ కేసులు పెరుగుతున్న సరళిని పరిశీలిస్తే.. ఏప్రిల్​ 15-20 మధ్యలో కొవిడ్ వ్యాప్తి తీవ్రమవుతుందని తెలుస్తోంది. కానీ, మే చివరికల్లా కేసుల సంఖ్య విపరీతంగా తగ్గే అవకాశాలూ ఎక్కువగానే ఉన్నాయి. కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాం. ప్రస్తుతం రోజువారీగా నమోదయ్యే కేసులు లక్షకు చేరువలో ఉన్నాయి. కానీ, కేసుల సంఖ్య మళ్లీ తగ్గుముఖం పట్టొచ్చు."

--మణీంద్ర అగర్వాల్, ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త.

కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో.. పంజాబ్​లో కేసులు విపరీతంగా పెరుగుతాయని, తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ఏప్రిల్​, మే మధ్య కాలంలో కేసులు విపరీతంగా పెరుగుతాయని ఇతర శాస్త్రవేత్తలూ అభిప్రాయపడ్డారు.

అప్పుడలా...

కొవిడ్​ మొదటి దశ వ్యాప్తి సమయంలో 'సూత్ర' అనే గణితశాస్త్ర నమూనాను ఉపయోగించి ఆగస్టులో కేసులు పెరుగుతాయని, సెప్టెంబర్​లో వైరస్​ ఉద్ధృతి తీవ్రతరమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 2021 ఫిబ్రవరికి వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని అంచనా వేశారు.

ఇదీ చదవండి:గంగా జలంతో కేసుల పరిష్కారం- పోలీసులపై చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.