ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజులోనే 785 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. భారీగా కేసులు పెరిగిన క్రమంలో జిల్లాలో సామాజిక వ్యాప్తి ప్రారంభమైనట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో దుర్గ్ జిల్లాను కరోనా హాట్‌స్పాట్‌గా ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా గ్రామాల్లో సెక్షన్-144 అమలు చేస్తున్నారు. వైరస్ సంక్రమణ మూలాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఉత్సవాలు, బహిరంగ సమావేశాలే వైరస్ వ్యాప్తికి కారణమని అధికారులు తెలిపారు.
వైరస్ కేసుల్లో పెరుగుదల దృష్ట్యా ఆ ప్రాంతంలో కొవిడ్ కేంద్రాలను పునఃప్రారంభిచాలని నిర్ణయించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గంభీర్ ఠాకూర్ తెలిపారు. కేసుల్లో పెరుగుదల ఉన్నా.. మరణాల రేటు తక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోందని అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 3.40 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వారిలో 3.16 లక్షల మందికిపైగా కోలుకోగా.. సుమారు 19వేల మంది చికిత్స పొందుతున్నారు. 4వేల మందికిపైగా కొవిడ్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి: అక్కడి ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా తప్పనిసరి!