ETV Bharat / bharat

కొవిడ్ విధుల్లో చేరే వైద్య విద్యార్థులకు ప్రోత్సాహకాలు! - మోదీ సమీక్ష

కరోనాపై పోరుకు సంబంధించి దేశంలో మానవ వనరుల లభ్యత వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైద్య సిబ్బందిపై పనిభారం తగ్గించటం, ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులను కొవిడ్ విధుల్లోకి తీసుకోవటంతో పాటు వారికి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : May 2, 2021, 3:43 PM IST

Updated : May 2, 2021, 5:16 PM IST

కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మానవ వనరుల లభ్యతను పెంచే మార్గాల అన్వేషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత సమీక్షా సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా.. మానవ వనరుల పెంపుతో పాటు కొవిడ్ విధుల్లో చేరే ఎంబీబీఎస్, నర్సింగ్ పాస్ఔట్ విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇవ్వటంపై చర్చించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ భేటీలోని తుది నిర్ణయాలను సోమవారం ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి.

" భేటీ నిర్ణయాల్లో నీట్ పరీక్ష వాయిదా, ఎంబీబీఎస్ పాస్ఔట్ విద్యార్థులు కొవిడ్ విధుల్లో చేరేందుకు ప్రోత్సహించటం వంటివి ఉండవచ్చు. వాటితో పాటు ఎంబీబీఎస్, నర్సింగ్ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థుల సేవలనూ వినియోగించుకోవటమూ ఉండొచ్చు. కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యతతో పాటు ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వొచ్చు. "

- ప్రభుత్వ వర్గాలు

కరోనా రెండో దఫా విజృంభణతో దేశంలోని కొన్ని చోట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది కొరత సహా.. అందుబాటులో ఉన్నవారిపై పనిభారం, ఒత్తిడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్మీ వంటి కేంద్ర సంస్థలు తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసి తమ వైద్య సిబ్బందితో పౌరులకు చికిత్స అందిస్తామని మోదీతో చర్చించారు.

ఇదీ చూడండి: హరియాణాలో వారం పాటు పూర్తిస్థాయి లాక్​డౌన్​

Last Updated : May 2, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.