COVID 19 Infected Cases: కరోనా మూడో దశలో వైరస్ సోకిన పిల్లలు, టీనేజర్లలో(11-17) తీవ్ర జ్వరం, వణుకుడు వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయని దిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ పీడియాట్రిక్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ధీరేన్ గుప్తా తెలిపారు. రెండేళ్లలోపు చిన్నారుల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మరికొందరికి ఆస్పత్రి చికిత్స కూడా అవసరమవుతున్నట్లు వెల్లడించారు.
"ఒమిక్రాన్.. రోగి శ్వాసవ్యవస్థపై ప్రధానంగా ప్రభావం చూపుతోంది. జలుబు, తలనొప్పి, చలి జ్వరం వంటి లక్షణాలు సర్వసాధారణం. కరోనా రెండో దశతో పోల్చితే.. మూడో దశలో చాలా తక్కువ మంది మాత్రమే రుచి, వాసన కోల్పోతున్నారు. వారి సంఖ్య ప్రతి పది మందిలో ఇద్దరు లేదా ముగ్గురుగా ఉంది. ఒమిక్రాన్, డెల్టా వైరస్ లక్షణాలు కలిశాయి."
-ధీరేన్ గుప్తా, పీడియాట్రిక్ పల్మోనాలజిస్ట్
Coronavirus Symptoms in Kids: ఒమిక్రాన్ వ్యాప్తి టీకా వేసుకున్నవారిలో ఒకవిధంగా, వ్యాక్సిన్ తీసుకోని వారిలో మరోలా ఉందని గుప్తా తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఇది మరీ తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. న్యుమోనియా ఉన్న కరోనా రోగులకు స్టెరాయిడ్స్ అవరసమవుతున్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'మహా'లో 44 వేలు.. బంగాల్లో 24 వేల కరోనా కేసులు- ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు