ETV Bharat / bharat

'ఆర్ వ్యాల్యూ' ఒకటి లోపే- కరోనా కంట్రోల్ అయినట్టేనా? - కోవిడ్ ఆర్ వ్యాల్యూ

దేశంలో కరోనా (Covid 19 india) వ్యాప్తి తగ్గుతున్నట్లు స్పష్టమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఆర్ వ్యాల్యూ (r value Covid) ఒకటి లోపే ఉంటోందని తేలింది. అయితే.. ప్రధాన నగరాలైన కోల్​కతా, బెంగళూరులో ఈ సంఖ్య ఒకటికి మించిపోయింది. (r value Covid India)

VIRUS-R-VALUE
ఆర్ వ్యాల్యూ ఒకటి లోపే
author img

By

Published : Oct 19, 2021, 4:50 PM IST

కరోనా వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్ ​వ్యాల్యూ (r value Covid India) క్రమంగా తగ్గుతోంది. సెప్టెంబర్ నుంచి ఆర్ వ్యాల్యూ ఒకటి లోపే ఉంటోంది. (Covid 19 india) యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లో ఆర్ వ్యాల్యూ (r value Covid) అక్టోబర్ 18 తర్వాత ఒకటి లోపునకు పడిపోయిందని చెన్నైకి చెందిన మేథమెటికల్ సైన్సెస్ ఇన్​స్టిట్యూట్ వెల్లడించింది. అయితే, కొన్ని నగరాల్లో మాత్రం యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని పేర్కొంది. కోల్​కతాలో ఆర్​ వ్యాల్యూ ఒకటి కన్నా అధికంగా ఉందని తెలిపింది. నవరాత్రుల్లో దుర్గా పూజ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడటం వల్ల కోల్​కతాలో కేసులు (Kolkata Covid cases) పెరిగాయని వివరించింది.

బెంగళూరులోనూ ఆర్​ వ్యాల్యూ (Bangalore Covid News) ఒకటి కన్నా అధికంగా ఉంది. మరోవైపు, చెన్నై, పుణె, ముంబయి నగరాల్లో ఆర్ వ్యాల్యూ ఒకటి లోపే ఉంది. మొత్తంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 18 మధ్య దేశంలో ఆర్​ వ్యాల్యూ (r value of Covid in India) 0.90గా ఉందని ఇన్​స్టిట్యూట్ లెక్కగట్టింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 మధ్య దేశంలో ఆర్ వ్యాల్యూ 1.11గా ఉండటం గమనార్హం. అప్పటి నుంచి ఈ వ్యాల్యూ క్రమంగా తగ్గుతూ వచ్చింది. సెప్టెంబర్ 4 నుంచి 7 మధ్య 0.94, 11 నుంచి 15 మధ్య 0.86, 14 నుంచి 19 మధ్య 0.92, 17 నుంచి 21 మధ్య 0.87గా నమోదైంది.

'రెండో డోసు ఇవ్వండి'

కరోనా టీకా పంపిణీ (Vaccination in India) వంద కోట్లకు చేరువలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది కేంద్రం. తగినన్ని టీకాలు అందుబాటులో ఉన్నందున.. రెండో డోసు లబ్ధిదారులకు (Vaccine second dose) వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టిసారించాలని స్పష్టం చేసింది. తక్కువ కవరేజీ ఉన్న జిల్లాలను గుర్తించి.. వాటిపై దృష్టిపెట్టాలని పేర్కొంది. స్థానిక సమస్యలను పరిష్కరించాలని, అవసరమైతే అదనంగా వ్యాక్సినేషన్ సెంటర్​లను ఏర్పాటు చేయాలని సూచించింది.
దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 99 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

మరోవైపు, అంతర్జాతీయ ప్రయాణాల కోసం నూతన మార్గదర్శకాలు రూపొందించే విషయంలో సలహాలు ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. కేంద్ర హోంశాఖ, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, పౌర విమానయాన శాఖ, విదేశాంగ శాఖలు సైతం సూచనలు ఇవ్వాలని పేర్కొంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.