కొవిడ్ మహమ్మారి రెండో దశ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశానికి అండగా నిలుస్తోంది నౌకాదళం. ఆపరేషన్ సముద్ర సేతు-2లో భాగంగా వివిధ దేశాల నుంచి నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు భారీగా వైద్య సామగ్రితో భారత్‌కు చేరాయి. సోమవారం మొత్తం.. 80 టన్నుల ఆక్సిజన్, 20 క్రియోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3,150 ఆక్సిజన్ సిలిండర్లు, పెద్ద మొత్తంలో ఇతర వైద్య సామగ్రిని తీసుకొచ్చాయి.
నౌకల్లో భారత్‌కు చేరిన వాటిలో 900 ఆక్సిజన్ నింపిన సిలిండర్లు, 10వేల రాపిడ్ యాంటీజెన్ కొవిడ్-19 పరీక్ష కిట్లు, 54 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 450 పీపీఈ కిట్లు ఉన్నట్లు నౌకాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు.
-
#Watch | INS Kolkata arrives in New Mangalore with 54 MT medical oxygen, 400 oxygen cylinders, and 47 oxygen concentrators from Qatar and Kuwait: Indian Navy pic.twitter.com/FQfC3SaXIf
— ANI (@ANI) May 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Watch | INS Kolkata arrives in New Mangalore with 54 MT medical oxygen, 400 oxygen cylinders, and 47 oxygen concentrators from Qatar and Kuwait: Indian Navy pic.twitter.com/FQfC3SaXIf
— ANI (@ANI) May 10, 2021#Watch | INS Kolkata arrives in New Mangalore with 54 MT medical oxygen, 400 oxygen cylinders, and 47 oxygen concentrators from Qatar and Kuwait: Indian Navy pic.twitter.com/FQfC3SaXIf
— ANI (@ANI) May 10, 2021
- విశాఖపట్నానికి ఐరావత్: భారత యుద్ధనౌక ఐరావత్.. సింగపూర్ నుంచి విశాఖపట్నం చేరుకుంది. 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 8 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, ఇతర ఔషధాలు, వైద్య సామగ్రిని తీసుకొచ్చింది.
- మంగళూరుకు ఐఎన్ఎస్ కోల్‌కతా: మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా.. కువైట్, ఖతార్ దేశాల నుంచి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, 400 ఆక్సిజన్ సిలిండర్లు, 47 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉన్నాయి.
- ముంబయికి ఐఎన్ఎస్ త్రికాండ్: ఖతార్ నుంచి 40 టన్నుల ఆక్సిజన్‌తో ఐఎన్ఎస్ త్రికాండ్ ముంబయికి చేరుకున్నట్లు నౌకాదళ ప్రతినిధి తెలిపారు.
రంగంలోకి 9 యుద్ధ నౌకలు..
కరోనా విజృంభణ నేపథ్యంలో.. గల్ఫ్, వాయవ్య ఆసియా దేశాల నుంచి ఆక్సిజన్, ఇతర ఔషధాలను తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సముద్ర సేతు-2 చేపట్టింది నౌకాదళం. అందులో భాగంగా గత వారం 9 యుద్ధ నౌకలను మోహరించింది.
ఇదీ చూడండి: కొవిడ్‌కు మరో సమర్థ ఔషధం!