ETV Bharat / bharat

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లేనా! - పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా ఉండేందుకే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సమావేశాల నిర్వహణపై ఇప్పటివరకు పార్లమెంట్ ఉభయసభలు సన్నాహాలు ప్రారంభించలేదు. దిల్లీలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండటం, మహమ్మారి వ్యాప్తి సాధారణంగా ఉన్నప్పుడు నిర్వహించిన వర్షాకాల సమావేశాల్లోనే పలువురు ఎంపీలకు వైరస్ సోకడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

parliament session
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
author img

By

Published : Nov 16, 2020, 11:54 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా ఉండేందుకే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

శీతాకాల సమావేశాలను బడ్జెట్ సెషన్​తో కలిపేయడం, లేదంటే.. నేరుగా బడ్జెట్ సమావేశాలే నిర్వహించడంపై సమాలోచనలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్​సభ, రాజ్యసభ సెక్రటేరియట్​లు సైతం శీతాకాల సమావేశాల నిర్వహణకు సన్నహాలు ప్రారంభించలేదని పేర్కొన్నాయి.

కరోనా వ్యాప్తి భయాలతో పాటు అధికారులతో చట్టసభ్యులు కలిసి పనిచేయాల్సి రావడం వల్ల ఈ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న వాదన తెరపైకి వచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటించినప్పటికీ వైరస్ సోకే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ నెల మధ్యలో ప్రారంభమై డిసెంబర్ మధ్య వరకు కొనసాగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం ఉంటే సభ్యులకు 15 రోజుల ముందుగానే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఆ సమయంలో తమ ప్రశ్నలను సభకు పంపిస్తారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమాచారం లేదు. దిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈసారి సమావేశాలు నిర్వహంచడంపై ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని అధికారులు చెబుతున్నారు.

"వర్షాకాల సమావేశాల సమయంలో దిల్లీలో రోజుకు రెండు నుంచి మూడు వేల కేసులు బయటపడేవి. ఆ సమయంలో 30 మందికి పైగా ఎంపీలు కొవిడ్ బారినపడ్డారు. అప్పుడే సమావేశాలు రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఏడు వేలకు పైగా ఉంటోంది."

-అధికారులు

పార్లమెంట్ తర్వాత సమావేశమయ్యేది బడ్జెట్ సమావేశాల కోసమేనని తెలుస్తోంది. 2021 జనవరి నెలాఖరున బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.