ETV Bharat / bharat

Covid Vaccine: 66 కోట్ల టీకా డోసులకు కేంద్రం ఆర్డర్​!

author img

By

Published : Jul 17, 2021, 6:35 AM IST

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను(Covid Vaccine) మరింత వేగంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 66 కోట్ల డోసుల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకుగానూ రూ. 14,500 కోట్లను మోదీ సర్కార్​ చెల్లించనుంది.

Government orders 66 crore vaccine doses
66 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్​

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ(Covid Vaccine) వేగంగా కొనసాగుతున్నప్పటికీ పలు రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 66 కోట్ల డోసుల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.14 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా.. త్వరలోనే వీటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దేశంలో మూడో దశ విజృంభణను ఎదుర్కోవాలంటే.. భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ(Covid Vaccine) చేయడమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ నాటికి దాదాపు 93 కోట్ల జనాభాకు వ్యాక్సిన్‌ అందించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 186 కోట్ల డోసులు అవసరం అవుతాయని ఈ మధ్యే సుప్రీంకోర్టుకు తెలిపింది. జులై నాటికి 51 కోట్లకు పైచిలుకు డోసుల పంపిణీ పూర్తిచేస్తామని పేర్కొంది. మిగతా 135 కోట్ల డోసులను ఆగస్టు-డిసెంబర్‌ మధ్యకాలంలో అందుబాటులోకి తీసుకొస్తామని భారత అత్యున్నత న్యాయస్థానానికి గతనెల సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగానే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల 66 కోట్ల డోసులను ఆర్డరు చేసినట్లు సమాచారం. ఇందుకు రూ.14,505 కోట్లను కేంద్రప్రభుత్వం ఖర్చుచేయనుంది.

వీటికితోడు బయోలాజికల్‌-ఇ తయారుచేసిన కార్బొవ్యాక్స్‌ 30 కోట్ల డోసుల కోసం కేంద్రం ముందస్తు చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు-డిసెంబర్‌ నాటికి 96 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు ప్రైవేటు రంగంలోనూ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌కు చెందిన 22 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటికి అదనంగా స్పుత్నిక్‌-వి, జైడస్‌ క్యాడిలా టీకాలు కూడా మార్కెట్‌లోకి రానున్నాయి. స్పుత్నిక్‌ 10 కోట్ల డోసులు, జైడస్‌ క్యాడిలా 5 కోట్ల డోసులను అందిస్తామని ఆయా టీకాల తయారీ సంస్థలు ప్రభుత్వానికి ఇదివరకే తెలియజేశాయి. దేశంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న కొవిడ్‌ టీకాల్లో 75 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరించి అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తోంది. మరో 25శాతం టీకాలను ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులు నేరుగా సేకరించి విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది.

ఇదీ చూడండి: కరోనా కట్టడి కోసం సీఎంలకు మోదీ '4T ఫార్ములా'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.