కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొవిడ్ చికిత్సకు కేటాయించిన ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ఆస్పత్రులన్నీ ప్రభుత్వ అధీనంలో పనిచేస్తాయని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
ఈ ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. సిబ్బంది యథావిధిగా కొనసాగుతారని, నియంత్రణ మాత్రమే ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ప్రతి ఆస్పత్రిని ఒక ప్రభుత్వ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు. కొవిడ్ బాధితుల కోసం 50 శాతం పడకలు కేటాయించాలన్న నిబంధనను అమలు చేయని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'కేంద్రం వ్యాక్సిన్ విధానంతో మూడో దశ ముప్పు'
ఇదీ చూడండి: గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 76మంది మృతి