దేశంలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 86 లక్షల వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 1.27 లక్షల మందినిపైగా ప్రజలను కొవిడ్ బలితీసుకుంది. మరోవైపు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 79.59 లక్షల మంది మహమ్మారిని జయించారు. కేరళలో మంగళవారం ఒక్కరోజే 6,010 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కేసుల సంఖ్య 5 లక్షలకు సమీపించింది. కొత్తగా 28 మంది మృతిచెందారు. ఫలితంగా మరణాల సంఖ్య 1,742కు చేరింది.
- దేశ రాజధాని దిల్లీలో మరో 5,023 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 4.3లక్షలు దాటింది. మరో 70 మంది కరోనాకు బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 7,060కి చేరింది.
- మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 3,791 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల సంఖ్య 17లక్షల 26వేల 926కు పెరిగింది. వైరస్ కారణంగా మరో 46 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 45వేల 435కు ఎగబాకింది.
- బంగాల్లో కొత్తగా 3,891 మందికి కొవిడ్ సోకినట్టు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 13వేల 112కు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,403 మంది కరోనాతో మృతి చెందారు.
- కర్ణాటకలో మరో 2,362 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 8లక్షల 51వేల 212కు చేరింది. మరో 20 మరణాలతో.. చనిపోయిన వారి సంఖ్య 11.430కి పెరిగింది.
- తమిళనాడులో ఒక్కరోజులోనే 2,146 మంది కరోనా బారినపడ్డారు. కేసుల సంఖ్య 7.48లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 11వేల 387 మంది కొవిడ్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి: వాపును ఈ ఆనవాళ్లతో గుర్తించండి!