ETV Bharat / bharat

Aryan Khan bail: ఆర్యన్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వు.. 20 వరకు జైల్లోనే..

ఆర్యన్‌ ఖాన్‌కు (Aryan Khan Bail) మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్​పై తీర్పును రిజర్వ్​ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్యన్​ 20వ తేదీ వరకు జైల్లోనే ఉండాల్సి ఉంది.

Aryan Khan bail
ఆర్యన్‌ బెయిల్‌
author img

By

Published : Oct 14, 2021, 6:11 PM IST

ముంబయిలోని క్రూయిజ్​ నౌక డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (Srk Son Bail) తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయనకు బెయిల్‌ (Aryan Khan Bail) ఇచ్చే అంశంపై తీర్పును ప్రత్యేక న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ నెల 20న బెయిల్‌పై తీర్పు వెలువరించనున్నట్టు వెల్లడించింది. దీంతో ఆర్యన్‌ను తిరిగి జైలుకు తరలించారు.

ఆర్యన్‌, అబ్బాజ్‌, మూన్‌మూన్‌ ధామేచాల బెయిల్‌ పిటిషన్‌పై ఎన్​సీబీ, డిఫెన్స్‌ న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘవాదనలు కొనసాగాయి. ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్​సీబీ వాదించింది. అనంతరం బెయిల్‌పై తీర్పును జడ్జి వీవీ పాటిల్‌ ఈ నెల 20కు వాయిదా వేశారు. దీంతో ఈ నెల 20 వరకు ఆర్యన్‌ జైల్లోనే ఉండనున్నారు.

ఇదీ చూడండి: సాంబార్​ రుచిగా లేదని.. తల్లి, సోదరి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.