ETV Bharat / bharat

భారత అత్యధిక వయస్కుడైన ఓటర్​ కన్నుమూత.. ఓటు వేసిన కొన్ని రోజులకే - Shyam Saran Negi passes away

దేశంలోనే అత్యధిక వయస్కుడైన ఓటర్ సరణ్​ నేగి కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్​ కిన్నౌర్ నివాసి అయిన శరణ్.. నవంబర్​ 2న పోస్టల్ బ్యాలెట్​ ద్వారా ఓటు వేశారు.

Country first voter Shyam Saran Negi passes away

author img

By

Published : Nov 5, 2022, 8:59 AM IST

Updated : Nov 5, 2022, 9:37 AM IST

Himachal Pradesh Elections 2022 : దేశంలోనే అత్యధిక వయస్కుడైన ఓటరుగా రికార్డు నమోదు చేసిన హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన 106 ఏళ్ల శ్యాం సరన్​ నేగి కన్నుమూశారు. నవంబర్​ 2న పోస్టల్​ బ్యాలెట్​తో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత పోలింగ్ సెంటర్​కే వెళ్లి ఓటేస్తానన్న శ్యాం.. తర్వాత మనసు మార్చుకున్నారు.

Country first voter Shyam Saran Negi passes away
పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు వేస్తున్న శరణ్​ నేగి

హిమాచల్​ ముఖ్యమంత్రి సంతాపం..
సరణ్​ నేగి మృతి పట్ల హిమాచల్​ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపం తెలిపారు. "కిన్నౌర్ ప్రాంతానికి చెందిన స్వతంత్ర భారత అత్యధిక వయస్కుడైన ఓటర్ శరణ్​ నేగి మరణ వార్త బాధ కలిగించింది" అని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

First Voter Of India : దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్​సభ ఎన్నికల్లో ఓటేశారు శ్యాం. ఆ సమయంలో ఆయన పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటు వేసి ఆ తర్వాత తన విధులకు హాజరయ్యారు. అప్పటి నుంచి లోక్​సభ, అసెంబ్లీ, పంచాయతీ రాజ్​ ఎన్నికల కలిపి మొత్తం 32 సార్లు ఓటేసి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆయన భారతీయ ప్రజాస్వామ్య 'లివింగ్ లెజెండ్'గా పేరొందారు. తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఓటు ప్రాముఖ్యాన్ని వివరించి మరీ ఓట్లు వేయించేవారు.

Postal Ballet : 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని ఎన్నికల శాఖ ప్రారంభించింది. 80 ఏళ్లు దాటిన ఓటర్లు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. దివ్యాంగులకు, కొవిడ్​ బాధితులకు కూడా పోస్టల్​ బ్యాలెట్​ సదుపాయం వర్తిస్తుంది.

ఇవీ చదవండి : ఆనవాయితీగా వస్తున్న పద్ధతిని మారుస్తారా? మార్పుకే ఓటేస్తారా?

నిరసన చేస్తుండగా కాల్పులు.. పంజాబ్​ శివసేన నేత దారుణ హత్య

Last Updated : Nov 5, 2022, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.