ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజే 1,733 మరణాలు - CORONAVIRUS UPDATE COVID CASES IN INDIA

COVID CASES IN INDIA: భారత్​లో కరోనా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు మరో 1,61,386 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,733 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

CORONAVIRUS UPDATE
కొవిడ్​ అప్​డేట్​
author img

By

Published : Feb 2, 2022, 9:32 AM IST

Covid cases in India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,733 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,81,109 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.2 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం మరణాలు: 4,97,975
  • యాక్టివ్ కేసులు: 16,21,603
  • మొత్తం కోలుకున్నవారు: 3,95,11,307

Covid Tests:

మంగళవారం.. దేశవ్యాప్తంగా 17 లక్షల 42 వేల 793 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్ట్​ల సంఖ్య 73 కోట్ల 24 లక్షలను దాటింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 28,63,792 మందికి కరోనా సోకింది. 11,168 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 38,17,96,932 కు చేరగా.. మరణాల సంఖ్య 57,04,155 కు పెరిగింది.

  • ఫ్రాన్స్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 4,16,896 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 381 మంది చనిపోయారు.
  • US Corona Cases: అమెరికాలో కొత్తగా 2,64,693 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,780 మంది మరణించారు.
  • ఇటలీలో 1.33 లక్షల కొత్త కేసులు బయటపడగా.. 339 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1,71,616 మందికి వైరస్​ సోకగా.. 767 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 43 వేలకుపైగా కరోనా కేసులు బయటపడగా.. 285 మంది బలయ్యారు.
  • జర్మనీలో ఒక్కరోజే దాదాపు 1,83,434 మందికి వైరస్ సోకింది. మరో 182 మంది మృతి చెందారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: కేరళలో తగ్గిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.