Coronavirus Update India: భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 2,202 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 27 మంది చనిపోయారు. ఒక్కరోజే 2,550 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్ కేసులు 17వేలకు చేరుకున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.04గా ఉంది. మరణాల శాతం 1.22గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,23,801
- మొత్తం మరణాలు: 5,24,241
- యాక్టివ్ కేసులు: 17,317
- కోలుకున్నవారి సంఖ్య: 42582243
Vaccination India: దేశవ్యాప్తంగా ఆదివారం 3లక్షల మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 191 కోట్ల 37 లక్షల 34 వేలు దాటింది. ఒక్కరోజే 2 లక్షల 97 వేల 242కి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజే మరో 3 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 581మందికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,12,66,603కు చేరింది. మరణాల సంఖ్య 62,88,475కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,19,12,393గా ఉంది.
- ఆస్ట్రేలియాలో మరో 42వేల కొత్త కేసులు వెలుగు చూశాయి. 21 మంది మరణించారు.
- జపాన్‌లో కొత్తగా 38వేల మందికి వైరస్ సోకింది. 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియా, ఇటలీ, ఫ్రాన్స్‌లో సగటున రోజుకు 35వేలకుపైగా వైరస్ బారినపడుతున్నారు.
- అమెరికాలో 21 వేల కేసులు, 24 మరణాలు నమోదయ్యాయి.
కొరియాలో కొవిడ్ పంజా: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా కరోనా బారినపడి 8 మంది మృతిచెందగా.. ప్రస్తుతం 3 లక్షల 92వేల మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలకు ఔషధాలను పంపిణీ చేసేలా ఆరోగ్యకార్యకర్తల్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు కిమ్ జోంగ్ ఉన్.
ఇదీ చూడండి: కొవిడ్‌తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి.. తలపట్టుకుంటున్న 'కిమ్'!
ఫేస్బుక్లో లవ్.. కులం వేరని పెళ్లికి నో.. గొడవపడి గొంతు కోసుకున్న ప్రేమికులు