ETV Bharat / bharat

Corona Vaccine: దేశంలో మరోసారి ఒక్కరోజులో కోటి డోసుల పంపిణీ - వ్యాక్సినేషన్

Corona Vaccine Update: దేశంలో మరోసారి ఒక్కరోజే కోటి డోసులు పంపిణీ అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు వ్యాక్సిన్​ తీసుకున్నవారి సంఖ్య 127.5 కోట్లు దాటింది.

vaccine
మరోసారి కోటి దాటిన టీకా పంపిణీ
author img

By

Published : Dec 4, 2021, 11:20 PM IST

Corona Vaccine Update: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పంపిణీని విస్తృతం చేసింది కేంద్రం. తాజాగా మరోసారి ఒక్కరోజే కోటి డోసుల పంపిణీని పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వ్యాక్సినేషన్​కు సంబంధించి భారత్​ కొత్త రికార్డులను నెలకొల్పుతోందని తెలిపారు.

శనివారం ఒక్కరోజే 1,00,00,016 మందికి టీకా పంపిణీ కాగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 127.5 కోట్లు దాటింది. రోజుకు సగటున 59.32 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు పెద్దల్లో 84.8 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 50 శాతం మంది రెండో డోసు తీసుకున్నట్లు తెలిపారు.

  • India achieves another 1 crore #COVID19 vaccinations today! With the Har Ghar Dastak campaign in full swing, the world's Largest Vaccination Drive is touching new heights & accomplishing new feats under PM Narendra Modi's leadership: Union Health Minister Mansukh Mandaviya pic.twitter.com/BfRQ0nrrvf

    — ANI (@ANI) December 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి : టీకా తీసుకోమన్నందుకు రాయితో కొట్టబోయిన వృద్ధుడు- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.