కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పని చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 2న అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది.
దేశవ్యాప్త డ్రై-రన్ నిర్వహించే విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ నేతృత్వంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించారు.
ఈనెల 28-29 తేదీలలో పంజాబ్, అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించారు.
ఇదీ చూడండి:మహాయజ్ఞానికి ముందస్తు కసరత్తు- 'డ్రై రన్'