ETV Bharat / bharat

'దేశంలో కరోనా తగ్గుముఖం.. ఆ రాష్ట్రాల్లో తప్ప!' - కేరళలో కరోనా

Corona Update: కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మినహా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కేంద్రం వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయని పేర్కొంది.

Corona Update
కరోనా
author img

By

Published : Feb 10, 2022, 5:37 PM IST

Corona Update: దేశంలో కరోనా గణనీయంగా తగ్గుముఖం పడుతోందని కేంద్రం వెల్లడించింది. ఇదివరకుతో పోలిస్తే పరిస్థితి మెరుగైందని.. ప్రపంచవ్యాప్తంగా ఊహించిన సమయం కంటే ముందే కేసులు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. జనవరి 24న దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని.. ఇప్పుడు 4.44 శాతానికి చేరిందని తెలిపింది. భారత్​లో కరోనా స్థితిపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించింది. మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా వైరస్​పై పూర్తి అవగాహన లేనందున అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

ఆ రాష్ట్రాల్లో తప్ప..

కొవిడ్​ వ్యాప్తి కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనకరంగానే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 40కు పైగా జిల్లాల్లో ఇంకా వీక్లీ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోందని పేర్కొంది. ప్రస్తుతం 141 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని.. 5-10 శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 160గా ఉందని వెల్లడించింది.

కేరళలో 29.57 శాతం పాజిటివిటీ రేటు ఉందని.. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యధికమని కేంద్రం తెలిపింది. మిజోరం, హిమాచల్​ ప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం రాష్ట్రాల్లో కూడా పాజిటివిటీ రేటు ఆందోళకరంగానే ఉందని చెప్పుకొచ్చింది.

విస్తృతంగా వ్యాక్సినేషన్​..

దేశంలో టీకాల పంపిణీ జరుగుతున్న విధానంపై కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్​ ముమ్మరంగా సాగుతోందని.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 96 శాతం మంది పెద్దలు తొలిడోసు అందుకున్నారని వెల్లడించింది. మరోవైపు 15-18 ఏళ్ల వారిలో 69 శాతం మంది తొలిడోసు తీసుకున్నారని.. 14 శాతం మందికి రెండు డోసులూ పంపిణీ చేసినట్లు వివరించింది.

ఇదీ చూడండి : వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ ఉందా? అయితే నో టెస్టింగ్, నో క్వారంటైన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.