ETV Bharat / bharat

పుట్టుకతోనే కరోనా.. ఇద్దరు పసికందులు మృతి!

మహారాష్ట్రలో కరోనా మరో విషాధాన్ని లిఖించింది. అప్పుడే పుట్టిన పసి పాపకు సోకడమే కాక వారం రోజుల్లోనే చిన్నారిని బలిదీసుకుంది. హిమాచల్​ప్రదేశ్​ సిమ్లాలోనూ 11 రోజుల పాప మృతి చెందింది.

newborn baby died with corona
శిశువుకు కరోనా
author img

By

Published : Jun 7, 2021, 8:36 AM IST

Updated : Jun 7, 2021, 10:10 AM IST

వారం రోజుల చిన్నారిని కరోనా కబళించిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాల్​ఘడ్​ జిల్లాలోని దర్శెత్​కు చెందిన ఓ చిన్నారికి కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. పుట్టిన 12 గంటలకు చేసిన పరీక్షలో అతడికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చికిత్స పొందుతున్న చిన్నారిని మెరుగైన వైద్యం కోసం తొలుత జవహర్​ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఆ తర్వాత నాసిక్​లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పసికందు తుదకు జూన్​ 5న ప్రాణాలు విడిచాడు.

సిమ్లాలోనూ..

హిమాచల్​ప్రదేశ్​లోనూ 11 రోజుల చిన్నారిని బలిగొంది కరోనా. సిమ్లాలోని ఐజీఎంసీలో చికిత్స పొందుతున్న పాపాయికి.. శనివారం సాయంత్రం పాజిటివ్​గా తేలింది. ఆదివారం సాయంత్రానికే శిశువు ప్రాణం పోయింది.

ఇదీ చూడండి: కేరళ చిన్నారికి కరోనా- 43కు చేరిన బాధితులు

Last Updated : Jun 7, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.