భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 45,674 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 559 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 85,07,754కి చేరింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,26,121కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో11,94,487 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 11,77,36,791 నమూనాలు పరీక్షించారు.
అయితే కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం 92.49కి పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.48 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.