దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీతోపాటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
- దిల్లీలో సోమవారం 3,726 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 108 మంది కరోనాతో మరణించారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 2,044 మంది కరోనా బారిన పడగా, మరో 19మంది మరణించారు
- కేరళలో మరో 3,382 మంది కరోనా బారిన పడ్డారు. 21మంది కరోనాకు బలయ్యారు.
- మహారాష్ట్రలో కొత్తగా 3,837మందికి కరోనా సోకింది. మరో 80మంది ప్రాణాలు కోల్పోయారు.
- గుజరాత్లో సోమవారం 1,502 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 20మంది వైరస్ బారిన పడి మరణించారు.
- హరియాణాలో కొత్తగా 1,605 మంది కరోనా సోకింది. వైరస్‌కు మరో 27మంది బలయ్యారు.
- పంజాబ్‌లో మరో 554 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 27మంది వైరసతో మరణించారు.
- తమిళనాడులో సోమవారం 1,410మంది కరోనా బారిన పడ్డారు. మరో 9 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 1,383 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో 10మంది మరణించారు.
ఇదీ చదవండి: లక్షణాలు ఉన్న వారితోనే వ్యాప్తి అధికం!