Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,298 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 23 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,916 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,22,777
- మరణాలు: 5,28,273
- యాక్టివ్ కేసులు: 46,748
- రికవరీలు: 4,39,47,756
Vaccination In India :
దేశంలో గురువారం 19,61,896 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 216.17 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,33,964 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,81,338 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,330 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,59,24,979 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,25,291 మంది మరణించారు. మరో 6,74,255 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,50,39,999 కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 99,546 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 192 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో కొత్తగా 71,432 కేసులు వెలుగుచూశాయి. మరో 72 మంది మరణించారు.
- రష్యాలో 56,126 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 99 మంది మృతి చెందారు.
- తైవాన్‌లో 45,470 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 57 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 40,692 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 249 మంది మృతి చెందారు.
శ్వాసనాళాల్లో యాంటీబాడీలు అధికంగా ఉంటే..
శ్వాసనాళాల్లో మ్యూకోసల్ యాంటీబాడీలు అధికంగా ఉంటే.. వ్యక్తులు ఒమిక్రాన్ రకం కరోనా వైరస్ బారిన పడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని స్వీడన్ పరిశోధకులు తెలిపారు. కొవిడ్ టీకా మూడు డోసులు తీసుకున్న 338 మంది ఆరోగ్య కార్యకర్తలపై వారు విస్తృత స్థాయిలో అధ్యయనం చేపట్టారు. వారి రక్తంలో, శ్లేష్మం (మ్యూకస్)లో యాంటీబాడీ స్థాయులు పెరిగిన తీరును పరిశీలించారు. ఇతరులతో పోలిస్తే.. శ్వాసనాళాల్లో మ్యూకోసల్ యాంటీబాడీలను ఎక్కువగా కలిగి ఉన్నవారు ఒమిక్రాన్ బారినపడే ముప్పు 50 శాతానికి పైగా తగ్గుతున్నట్లు నిర్ధారించారు.
ఇవీ చదవండి: 'సోవా'తో సొమ్మంతా స్వాహా.. భారత్‌కు కొత్త మొబైల్ వైరస్ ముప్పు!