Corona Cases in India : భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 268 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 182 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,46,79,031
- మరణాలు: 5,30,696
- యాక్టివ్ కేసులు: 3,552
- రికవరీలు: 4,41,43,665
Vaccination In India : దేశంలో బుధవారం 99,231 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,08,33,449కు చేరింది. ఒక్కరోజే 91వేల మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,98,400 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,555 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,32,51,506 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 66,91,268 మంది మరణించారు. మరో 3,98,607 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,55,35,573కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 216,219 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 415 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియా 87,517 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 80 మంది మృతి చెందారు.
- బ్రెజిల్లో 37,104 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 337 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో కొత్తగా 36,881 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 296 మంది ప్రాణాలు విడిచారు.
- తైవాన్‌లో 28,168 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 25 మంది మృతి చెందారు.