ETV Bharat / bharat

వాతావరణ మార్పుపై భారత్​-బ్రిటన్​ చర్చ - వాతావరణ మార్పులు

ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం(సీఓపీ) అధ్యక్షుడిగా ఎంపికైన బ్రిటన్​ ఎంపీ అలోక్​ శర్మ.. భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్​ జయశంకర్​, పర్యావరణ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​తో సమావేశమయ్యారు. నవంబర్​లో.. బ్రిటన్​లో జరగబోయే సీఓపీ 26వ సమావేశంలో ఇరుదేశాలు పోషించే పాత్రపై చర్చించారు.

COP26 president
ప్రధాని మోదీతో సీఓపీ అధ్యక్షుడి భేటీ
author img

By

Published : Feb 17, 2021, 9:50 AM IST

ఐక్యరాజ్యసమితి 26వ వాతావరణ మార్పుల సమావేశం(సీఓపీ) అధ్యక్షుడిగా ఎంపికైనా బ్రిటన్​ ఎంపీ అలోక్​ శర్మ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ఏడాది నవంబర్​లో జరగబోయే ఐక్యరాజ్యసమితి 26వ వాతావరణ మార్పుల ముసాయిదా సమావేశంలో(యూఎన్​ఎఫ్​సీసీసీ) వాతావరణ మార్పుల మీద భారత్​-బ్రిటన్​ల సహకారంపై చర్చించినట్లు అలోక్​ తెలిపారు. మంగళవారం జరిగిన ఈ భేటీపై మోదీ ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

"సీఓపీ26 అధ్యక్షుడిగా ఎంపికైన అలోక్​తో సమావేశంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. నవంబర్​లో జరిగే యూఎన్​ఎఫ్​సీసీసీ సమావేశంలో వాతావరణ మార్పులపై భారత్​-బ్రిటన్​ల సహకారంపై చర్చించాం."

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

విదేశాంగ మంత్రి ఎస్​ జయశంకర్​, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్​తో కూడా అలోక్​ శర్మ భేటీ అయ్యారు. పారిస్​ ఒప్పందానికి సంబంధించి మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి బ్రిటన్​తో పని చేయడానికి భారత్​ ఎదురుచూస్తోందని జావడేకర్​ అన్నారు.

సీఓపీ యూఎన్​ఎఫ్​సీసీసీ అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ. సీఓపీ 26 సమావేశాలు బ్రిటన్​లోని గాస్లోలో నవంబర్​లో జరగనున్నాయి.

ఇదీ చూడండి: త్రిపుర సీఎం వ్యాఖ్యలపై నేపాల్ అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.