మాస్క్ ధరించని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్కు రూ.2000 జరిమానా విధించారు పోలీసులు. ఒడిశాలోని పూరీలో ఈ సంఘటన జరిగింది.
పూరీలోని బడాదండా గ్రామంలో మాస్క్ ధరించకుండా ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన అధికారులు అతనికి జరిమానా విధించారు.
పూరీ జిల్లాలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇప్పటికే 5,923 మందికి జరిమానా వేశారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ భయాలు- వలస శ్రామికుల అష్టకష్టాలు