ETV Bharat / bharat

హెలికాప్టర్​ ప్రమాద ఘటనలో మరో ఆరు మృతదేహాలు గుర్తింపు - కూనూర్​ హెలికాప్టర్​ ప్రమాదం

Coonoor helicopter accident: తమిళనాడు కూనూర్​ హెలికాప్టర్​ ప్రమాదంపై సైన్యం ఓ ప్రకటన చేసింది. తాజాగా.. ఆరు మృతదేహాలను గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించినట్టు స్పష్టం చేసింది. మరో నలుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పేర్కొంది.

coonoor helicopter accident
హెలికాప్టర్​ ప్రమాదం ఘటనలో మరో ఆరు మృతదేహాలు గుర్తింపు
author img

By

Published : Dec 11, 2021, 10:14 AM IST

కూనూర్​ హెలికాప్టర్​ ప్రమాదం ఘటనలో మరో ఆరు మృతదేహాలను గుర్తించారు అధికారులు. వాటిల్లో నలుగురు భారత వాయుసేన సభ్యులు కాగా.. మరో ఇద్దరు సైన్యానికి చెందినవారు.

"నలుగురు ఐఏఎఫ్​ సిబ్బందిని గుర్తించే ప్రక్రియ పూర్తయింది. అంతిమసంస్కారాల కోసం మృతదేహాలను విమానాల్లో తరలిస్తాము. ఇప్పటికే కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించాము. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి." అని సైన్యం ఓ ప్రకటన చేసింది.

తమిళనాడు కూనూర్​లో సీడీఎస్​ బిపిన్​ రావత్​ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​.. బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో మొత్తం 14మంది హెలికాప్టర్​లో ఉన్నారు. బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ సహా మొత్తం 13 మంది ఈ ఘటనలో మరణించారు. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​.. బెంగళూరులో చికిత్స పొందుతున్నారు.

బిపిన్​ రావత్​, మధులికా రావత్​, బ్రిగేడియర్​ లిద్దర్​ అంత్యక్రియలు.. శుక్రవారం సైనిక లాంఛనాలతో జరిగాయి. ఈ ఘటనలో మరో నలుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

ఇదీ చూడండి:-

CDS Helicopter Crash: ట్రై సర్వీస్ విచారణ అంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.