constable caught rapist in minutes: విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి, కామాంధుడి చెర నుంచి ఆరేళ్ల బాలికను కాపాడిన పోలీస్ కానిస్టేబుల్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అభినందించారు.
లైవ్‌లో ట్రాక్ చేసి...
లాభూరామ్... రాజస్థాన్ సిరోహి జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విధి నిర్వహణలో భాగంగా సిరోహిలోని అభయ్ కమాండ్ సెంటర్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లైవ్‌ను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఓ 50 ఏళ్ల వ్యక్తిపై లాభూరామ్కు అనుమానం వచ్చింది.
Rajasthan cm praise constable
ఓ బాలికను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. ఏదో తేడాగా అనిపించి ఆ బైక్‌ను ట్రాక్ చేశారు లాభూరామ్. సిరోహిలోని ఇతర సీసీటీవీ కెమెరాల లైవ్‌ను నిశితంగా పరిశీలించారు. ఓ చోట బైక్ ఆపి, బాలికతో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించారు. వెంటనే సమీప పోలీస్ స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. లాభూరామ్ ఇచ్చిన సమాచారంతో నాలుగు నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకున్నారు పెట్రోలింగ్ పోలీసులు. బాలికపై అత్యాచారం చేస్తుండగానే ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
నిందితుడిని, బాధితురాలిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలిక తల్లిదండ్రులనూ పిలిపించారు. నిందితుడిపై అపహరణ, ఐపీసీ కింద అత్యాచారం కేసు, పోక్సో కేసు నమోదు చేశారు.
సీఎం అభినందనలు
కానిస్టేబుల్ వృత్తి నిబద్ధతపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రశంసలు కురిపించారు. స్వయంగా లాభూరామ్కు ఫోన్ చేసి అభినందించారు. సత్వరమే స్పందించి నిందితుడ్ని పట్టుకున్న గస్తీ బృందాన్ని కొనియాడారు.
ఇదీ చదవండి: 87 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం- నిస్సహాయ స్థితిలో ఉండగా..