ETV Bharat / bharat

'పెండింగ్​లో ఉన్న డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే' - ఉద్యమ సమయంలో రైతులపై నమోదైన కేసులు ఎన్ని?

Farmers Protest Today: రైతు డిమాండ్లను నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించేందుకు గురువారం మరోసారి సమావేశం కానున్నట్లు ప్రకటించింది. అయితే తమ డిమాండ్లకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై రైతు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు వెల్లడించింది.

farmers
రైతులు
author img

By

Published : Dec 8, 2021, 10:09 PM IST

Updated : Dec 8, 2021, 10:23 PM IST

Farmers Protest Latest News: రైతుల సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లపై కేంద్రం రూపొందించిన ముసాయిదాపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) వెల్లడించింది. ఈ మేరకు ఎస్​కేఎం కోర్ కమిటీ సభ్యుడు గుర్నామ్ సింగ్ ఛడూని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు అంశాలపై ఏకీభవిస్తున్నట్లు తెలిపిన ఆయన.. 'గురువారం సమావేశం అనంతరం ఆందోళన విరమించే విషయమై నిర్ణయం తీసుకుంటాం' అని స్పష్టం చేశారు.

Samyukta Kisan Morcha: అయితే 'ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చాలి. రైతులపై 'నకిలీ' కేసుల ఉపసంహరణకు విధించిన షరతులు సహా.. ప్రభుత్వ ప్రతిపాదనలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలి. బంతి ఇప్పుడు ప్రభుత్వ కోర్టులో ఉంది' అని మరో రైతు నేత యుధ్​వీర్ సింగ్ తెలిపారు.

News Farm Laws Withdrawn: వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఆందోళన చేపడుతున్న రైతు డిమాండ్లకు తలొగ్గిన కేంద్రం.. నవంబర్ 29న పార్లమెంటులో అందుకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. అయితే.. ఎంఎస్​పీ​పై చట్టబద్ధమైన హామీ, రైతులపై కేసుల ఉపసంహరణ, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం వంటి ఇతర డిమాండ్లను సైతం నెరవేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నందున ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ డిమాండ్ల సాధన కోసం కేంద్రంతో చర్చల కోసం ఎస్​కేఎం ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను సైతం ఏర్పాటు చేసింది.

మరోవైపు.. కేంద్రంతో చర్చల్లో లఖింపుర్ ఖేరీ అంశం కూడా తమ ఎజెండాలో ఉంటుందని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 8, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.