ETV Bharat / bharat

భాజపా, కాంగ్రెస్​ మధ్య మళ్లీ 'రఫేల్' రగడ!​ - సంబిత్ పాత్ర

రఫేల్​ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్​ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో.. కాంగ్రెస్​, భాజపా పరస్పర విమర్శల దాడికి దిగాయి. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి ముందుకు వచ్చి స్వయంగా దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్​​ డిమాండ్ చేసింది. రఫేల్ ఒప్పందంలో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు అందకపోవడం వల్లే ఆ పార్టీ ఈ ఆరోపణలు చేస్తోందని భాజపా ఆరోపించింది.

rafale deal
రఫేల్​ ఒప్పందంలో అక్రమాలు
author img

By

Published : Jul 4, 2021, 4:34 AM IST

Updated : Jul 4, 2021, 6:56 AM IST

రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల సయమంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌ దర్యాప్తు ప్రారంభించడమే ఇందుకు కారణం. రఫేల్‌ డీల్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ మరోసారి డిమాండ్‌ లేవనెత్తింది. ఇందుకు ప్రధాని మోదీ తక్షణమే ఆదేశాలివ్వాలని కోరింది.

"రఫేల్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఫ్రాన్స్‌ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీ చేసిన వాదనే నిజమని తేలింది. అక్రమాలు జరిగాయని ఫ్రాన్స్‌ ప్రభుత్వమే అంగీకరించినప్పుడు మన దేశంలో దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో ఎందుకు దర్యాప్తు చేయించకూడదు. ఇది దేశ భద్రత, సమగ్రతకు సంబంధించిన విషయం గనుక దీనిపై స్వతంత్ర దర్యాప్తు ఒక్కటే మార్గం. ప్రధాని స్వయంగా ముందుకొచ్చి దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలి"

-రణదీప్‌ సుర్జేవాలా, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

ఇక్కడ సమస్య భాజపా.. కాంగ్రెస్‌ మధ్య కాదని, దేశ భద్రతకు సంబంధించినదని సూర్జేవాలా అన్నారు. ఈ అంశం తమ పరిధి కాదని సుప్రీం కోర్టు ఇప్పటికే తేల్చినందువల్ల, దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించబోమని చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా రఫేల్ అంశంపై విమర్శలు చేశారు. "సూర్యుడు, చంద్రుడు, సత్యాన్ని ఎల్లకాలం దాచడం కుదరదు" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

ఏజెంటుగా రాహుల్: భాజపా

ప్రత్యర్థి ఆయుధ కంపెనీలకు ఏజెంట్​లా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని భాజపా దుయ్యబట్టింది. రఫేల్ అంశంలో కొన్ని సంస్థలు ఆయనను పావుగా వాడుకున్నాయని ఆరోపించింది. భారత్​ను బలహీనం చేయడానికే కాంగ్రెస్ పదేపదే ఈ వ్యవహారంపై అవినీతి ఆరోపణలు చేస్తోందని భాజపా అధికారప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు.

"ఓ స్వచ్చంద సంస్థ చేసిన ఫిర్యాదు ఫలితంగానే రఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్ న్యాయ విచారణకు ఆదేశించింది. దీన్ని బట్టి అవినీతి జరిగిందని భావించరాదు. భారత్ లో ఓ అధికారి ఏదైనా అంశం తన దృష్టికి వచ్చినప్పుడు సంబంధిత దస్త్రంపై 'తగు విధంగా చర్యలు తీసుకోండి' అని రాయడం లాంటిదే ఇది. దీనిపై కాంగ్రెస్ అసత్యాలు, అపోహలను వ్యాప్తి చేస్తోంది. రఫేల్ ఒప్పందంలో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు అందకపోవడం వల్లే ఆ పార్టీ ఈ ఆరోపణలు చేస్తోంది."

-సంబిత్ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి

రూ.59వేల కోట్ల విలువ చేసే రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైందని, ఇందుకు ఆ దేశ ప్రభుత్వం ఓ న్యాయమూర్తిని కూడా నియమించిందని అక్కడి ప్రముఖ మీడియా సంస్థ 'మీడియా పార్ట్‌' ఓ కథనం రాసింది. ఈ ఒప్పందం ఖరారు సమయంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్‌ హోలండే వ్యవహరించిన తీరుపైనే ప్రధానంగా దర్యాప్తు సాగనున్నట్లు తెలిపింది. ఒప్పందం ఖరారు సమయంలో పలువురికి ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: రఫేల్ రగడపై సుప్రీంలో విచారణ

ఇదీ చూడండి: రఫేల్​ డీల్​పై రాహుల్​ 'కర్మ సిద్ధాంతం'

Last Updated : Jul 4, 2021, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.