Chhattisgarh Election: చాలా రోజులకు కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే విజయం దక్కింది. ఛత్తీస్‌గఢ్ పుర పోరులో ఘన విజయం సాధించింది. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలు, ఆరు నగర పంచాయతీలను కైవసం చేసుకుంది.
బీర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్, జాముల్ మున్సిపల్ కౌన్సిల్ మినహా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది.
Congress Registered Landslide Victory: అద్భుత విజయం అందించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అమలు చేసిన పక్కా ప్రణాళికలతోనే గెలిచినట్లు పేర్కొన్నారు ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మోహన్ మార్కం.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది భాజపా. ఆ పార్టీ బహిరంగంగానే ధనబలం, కండబలం ఉపయోగించిందని అన్నారు ప్రతిపక్ష నేత ధరంలాల్ కౌశిక్.
''కొన్ని చోట్ల మా అభ్యర్థులు 2,4 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. 10 ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో ఓటమి పాలైనప్పుడు.. అధికార దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారం ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ఈవీఎంలను ఉపయోగించలేదు.''
- ధరంలాల్ కౌశిక్, భాజపా నేత
Birgaon Municipal Corporation: మరోవైపు బీర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెల్చిన తండ్రీకూతుళ్లను సీఎం భూపేశ్ బఘేల్ అభినందించారు. వేర్వేరు వార్డుల నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఉబరాన్దాస్ బంజారే(కాంగ్రెస్), సుశీల మార్కండే(స్వతంత్ర అభ్యర్థి) విజయాలు సాధించారు. దీంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
బీర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్లో 40 సీట్లకుగానూ కాంగ్రెస్ 19 చోట్ల విజయం సాధించింది. భాజపా 10 దక్కించుకుంది. శివ్‌పుర్ చర్చా మున్సిపల్ కౌన్సిల్లో 15కు గానూ కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందింది. భాజపా ఐదుకే పరిమితమైంది.
నాహర్పుర్ నగర పంచాయతీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ 11 గెలిచి భాజపాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.
ఇవీ చూడండి: ఒకే ఎన్నికలో తండ్రీకుమార్తెల విజయం..!