ETV Bharat / bharat

భారత్​ బంద్​కు కాంగ్రెస్​ మద్దతు

author img

By

Published : Dec 6, 2020, 12:51 PM IST

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఈనెల 8న పిలుపునిచ్చిన భారత్​ బంద్​కు మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపింది.

Congress supports bharat bandh
భారత్​ బంద్​కు కాంగ్రెస్​ మద్దతు

సాగు చట్టాలపై కేంద్రంతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవటం వల్ల ఈనెల 8న భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో బంద్​కు విపక్ష, భాజపా భాగస్వామ్యేతర ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్​ కూడా భారత్​ బంద్​కు మద్దతు ప్రకటించింది.

" డిసెంబర్​ 8న జరగబోయే భారత్​ బంద్​కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న మా పార్టీ కార్యాలయ్యాల్లో ఆందోళనలు చేపడతాం. ఇది రైతుల పట్ల రాహుల్​ గాంధీ మద్దతును మరింత బలోపేతం చేస్తుంది. దేశవ్యాప్త బంద్​ విజయవంతమవుతుందని భరోసా ఇస్తున్నాం."

- పవన్​ ఖేరా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి.

రైతులు చేస్తోన్న ఆందోళనలకు మొదటి నుంచే మద్దతుగా నిలుస్తున్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ట్విట్టర్​తో పాటు బహిరంగంగానూ కేంద్రంపై విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికే.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రైతుల సమస్యలు పరిష్కరించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కేంద్రానికి హెచ్చరికలు పంపారు.

ఇదీ చూడండి: రైతు దీక్ష: నడిరోడ్డే వేదిక.. వెనకడుగే లేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.