ETV Bharat / bharat

'శాంటా అందరి కోరికలు వింటాడు.. మోదీ మాత్రం' - కాంగ్రెస్​ శాంటా క్లాజ్​

Congress Santa Claus: క్రిస్మస్ వేళ శాంటాక్లాజ్​ చేసే పనులకు, కేంద్రం ప్రభుత్వ తీరుకు ముడిపెడుతూ కాంగ్రెస్​ పార్టీ కొత్త తరహాలో విమర్శలు చేసింది. చమురు ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేసింది.

Congress Santa Claus
కాంగ్రెస్​ క్రిస్మస్​ శాంటాక్లాజ్ విమర్శలు
author img

By

Published : Dec 25, 2021, 3:35 PM IST

Congress Santa Claus: ఈ క్రిస్మస్ పండగ వేళ.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కొత్త తరహాలో విమర్శలు చేసింది. ఈ పండగ అనగానే ముందుగా గుర్తొచ్చే శాంటాక్లాజ్‌ను తన ట్వీట్లలో భాగంచేసి, విమర్శల పదును పెంచింది. చమురు ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేసింది. క్రిస్మస్ వేళ శాంటా చేసే పనులకు, కేంద్రం ప్రభుత్వ తీరుకు ముడిపెడుతూ ఇలా ట్విట్టర్‌లో స్పందించింది.

Congress Christmas:

  • థాంక్‌గాడ్‌.. శాంటాక్లాజ్‌ ఇంధనం కోసం భారీగా చెల్లించాల్సిన అవసరం లేదు. శాంతా స్లీగ్‌ మీద ప్రయాణిస్తాడు కాబట్టి సరిపోయింది.
  • మన సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టకుండా.. వస్తువుల్ని కొంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా..! తాను ఇచ్చే బహుమతులన్నింటినీ శాంటా ఉత్తర ధ్రువం నుంచి తెస్తున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఇక్కడైతే ఖర్చు తడిసిమోపడయ్యేది.
  • మన ప్రభుత్వం వద్ద ఏ సమాచారం ఉండదు. అదే శాంటా అయితే ఎవరు అల్లరివారో, ఎవరు మంచి పిల్లలో ముందస్తుగా ఒక జాబితాను సిద్ధం చేసుకుంటాడు.
  • ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజల సమస్యలు వినే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దేవుడి దయ వల్ల శాంటా అందరి కోరికలు వింటున్నాడు. మోదీ మాత్రం తన మనసులో మాట మాత్రమే వింటున్నారు.

ఇదీ చూడండి: ఎస్పీ నేత ఇంట్లో నల్లధనం.. విలువ రూ.177 కోట్లు!

ఇదీ చూడండి: 'సైఫ్- కరీనా కొడుకు పేరేంటి?'.. ఆరో తరగతి ఎగ్జామ్​లో ప్రశ్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.