ETV Bharat / bharat

'సంస్కరణలతోనే కాంగ్రెస్​కు పునరుజ్జీవం'

భాజపాకు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా మారాలంటే కాంగ్రెస్​లో సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. పార్టీ క్రియాశీలంగానే ఉందన్న విషయం అందరికీ తెలియాలని అన్నారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

kapil sibal congress inertia
కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కపిల్ సిబల్
author img

By

Published : Jun 13, 2021, 5:39 PM IST

కాంగ్రెస్​లోని అన్ని స్థాయిల్లో విస్తృత సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. పార్టీ స్తబ్దుగా లేదన్న విషయాన్ని నిరూపించుకునేందుకు ఇవి అత్యావశ్యకమని అన్నారు. దేశవ్యాప్తంగా భాజపాకు ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు సంస్కరణలే కీలకమని స్పష్టం చేశారు. కొవిడ్ కారణంగా వాయిదా పడిన పార్టీ అంతర్గత ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

"ప్రస్తుతం భాజపాకు రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కానీ ప్రధాని మోదీ దేశాన్ని పాలించే నైతిక అర్హత కోల్పోయారు. భాజపాయేతర పార్టీలు ఇటీవలి ఎన్నికల్లో గెలవడాన్ని బట్టి చూస్తే కాషాయదళం పరిస్థితి అర్థమవుతుంది. కఠిన ప్రత్యర్థి ఎదురైతే భాజపా ఓడిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ భాజపాకు ప్రత్యామ్నాయంగా అవతరించవచ్చు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు నిర్వహించడం సరైనదే. కానీ సమావేశాల్లో ఇచ్చిన సిఫార్సులను అమలు చేయకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. పార్టీకి పునరుజ్జీవం లభించాలి. అలా జరగాలంటే.. పార్టీ క్రియాశీలంగా ఉందని ప్రజలకు తెలియాలి. ఇందుకోసం సంస్థాగతంగా సంస్కరణలు తీసుకురావాలి."

-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత

అసోంలో ఏఐయూడీఎఫ్, బంగాల్​లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్​తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు సిబల్. మైనారిటీ రాజకీయాలతో పాటు, మెజారిటీ కమ్యూనలిజం దేశానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ గుర్తించలేకపోయిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యానికి ఇదీ ఓ కారణమని చెప్పారు.

ఇవీ చదవండి:

మొన్న సింధియా.. నిన్న ప్రసాద.. తర్వాత?

'కాంగ్రెస్‌ బాగుపడాలంటే శస్త్రచికిత్స అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.