కరోనా టీకా పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 21శాతం మందికి మాత్రమే రెండుడోసులు పంపిణీ చేసి 31శాతం మందికి వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. గతంలో హామీ ఇచ్చినట్లు ఈ ఏడాది చివరికల్లా 18 ఏళ్లుపైబడిన అందరికీ ఏవిధంగా టీకా పంపిణీ చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ద్రవ్యోల్బణం, ఉగ్రవాదం గురించి ప్రస్తావించకపోవటాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ తప్పుపట్టారు. కరోనాతో చనిపోయిన 4 లక్షల 53వేల మందికి సంతాపం తెలపకుండా.... ప్రధాని సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
చైనాపై ద్వంద్వ వైఖరి
మేడ్ ఇండియాపై కేంద్రం రెండు నాలుకల వైఖరి అవలంభిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. చైనాతో భారత్ వాణిజ్య లోటు 49శాతం పెరగడంపై విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా ఆందోళన వ్యక్తం చేసిన అనంతరం రాహుల్ ఈ విమర్శలు చేశారు. ఓ మీడియా వార్తను కూడా ట్యాగ్ చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది మొదటి 9 నెలల్లో చైనాతో భారత్ వాణిజ్య విలువ 90 బిలియన్ డాలర్లను తాకింది. 49 శాతం పెరుగుదల నమోదైంది.
-
The Usual Doublespeak. #MadeInIndia #Jumla pic.twitter.com/Lt0wybWHxS
— Rahul Gandhi (@RahulGandhi) October 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Usual Doublespeak. #MadeInIndia #Jumla pic.twitter.com/Lt0wybWHxS
— Rahul Gandhi (@RahulGandhi) October 22, 2021The Usual Doublespeak. #MadeInIndia #Jumla pic.twitter.com/Lt0wybWHxS
— Rahul Gandhi (@RahulGandhi) October 22, 2021
ఇదీ చదవండి: చైనాకు దీటుగా సరిహద్దులో భారత్ యుద్ధ సన్నద్ధత